Nomination Process Finished For Telangana And AP Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు పూర్తవడంతో అభ్యర్థులు ప్రచారం స్పీడ్ పెంచనున్నారు.
సార్వత్రిక ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఒకే దశలో జరగనున్న ఎన్నికకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం పూర్తయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్‌సభ స్థానాలు, 176 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నామినేషన్లు పూర్తవగా భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్ల పర్వం పూర్తవడంతో రాజకీయ పార్టీలు ఇక ప్రచార జోరు పెంచనున్నాయి.
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎంపీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 547 మంది నామినేషన్లు సమర్పించారు. చివరి రోజు కావడంతో అభ్యర్థులంతా నామినేషన్లు సమర్పించేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. ఇక బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ కూడా భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కానీ ఇప్పటివరకు ఆ వివరాలు అందలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ స్థానంలో పదికి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి.
తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు సమయానికే నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆఖరి రోజు వరకు ఏం జరుగుతుందో తెలియకపోవడంతో ఆశావహులు అభ్యర్థిత్వం ప్రకటించకుందే నామినేషన్లు వేశారు. నిన్న ముగ్గురు అభ్యర్థులను ప్రకటించగా వారు ఈరోజు హుటాహుటిన నామినేషన్లు సమర్పించారు. ఇక బీజేపీ నాయకులు ఆలస్యంగా నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం.లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఒకేరోజు జరుగుతున్న విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో పూర్తయింది.
నామినేషన్లు పూర్తవడంతో శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఉండనుంది. నిబంధనలకు అనుగుణంగా నామినేషన్లు సమర్పించని వారివి అధికారులు తిరస్కరిస్తారు. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అనంతరం తుది అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. మే 13వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన తుది ఫలితాల వెల్లడి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.mahesh babu
General Elections Lok Sabha Elections Candidates Nomination Process End
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Power Consumption: రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం.. ఒక్కరోజులోనే ఇంతనా..!Electricity Demand In Hyderabad: ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. గురువారం మధ్యాహ్నం వరకు 4053 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మైలురాయిని అధికమించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు నిరంతరం విద్యుత్ సరఫరా చేశారు.
Read more »
Heat Waves Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజులు తీవ్ర వడగాల్పులు, తస్మాత్ జాగ్రత్తIMD Warns of Severe heat waves in andhra pradesh and telangana ఏపీలో రానున్న మూడ్రోజులు భానుడి భగభగలు కొనసాగనున్నాయి. ఎండలు రోజురోజుకూ మండిపోతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 42-45 డిగ్రీల వరకూ చేరుకుంటోంది
Read more »
Loksabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళే నామినేషన్లకు ఆఖరి తేదీ, రేపు రెండో విడత పోలింగ్Andhra pradesh and telangana elections today april 25 ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు ఇవాళే చివరి తేదీ. రేపు అంటే ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.
Read more »
Harish Shankar Letter: కెలుక్కుంటాను అంటే రా చూస్కుందాం హరీశ్ శంకర్ సంచలన లేఖHarish Shankar Letter On Chota K Naidu Commnts: తెలుగు సినీ పరిశ్రమలో మాటల తూటాలు పేలాయి. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ మధ్య రా చూస్కుందాం అనే స్థాయిలో వివాదం రాజుకుంది. కాస్కో అంటూ సవాళ్ల పర్వం కొనసాగింది.
Read more »
YS Sharmila Assets: తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఆస్తులున్న మహిళ షర్మిల.. ఆమె ఆస్తులెన్నో తెలుసా?You Know YS Sharmila Assets Value How Many Cases: మొదటిసారి ఎన్నికల్లో నిలబడ్డ షర్మిల నామినేషన్ పత్రంలో తన ఆస్తిపాస్తులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులున్న రాజకీయ మహిళగా షర్మిల నిలిచారు.
Read more »
NEET PG 2024: నీట్ పీజీ 2024 దరఖాస్తులు షురూ, చివరి తేదీ ఎప్పుడంటేNEET PG 2024 Examination application process star నీట్ పీజీ 2024 పరీక్షకు సంబంధించిన దరఖాస్తులు ఏప్రిల్ 16 నుంచి ఆన్‌లైన్ విధానంలో స్వీకరిస్తున్నారు. మే 6 వరకూ ఈ పక్రియ కొనసాగనుంది. మే 10 నుంచి మే 16 వరకూ దరఖాస్తుల సవరణకు అవకాశముంటుంది
Read more »