Chandrababu Gets Emotional On Vijayawada Floods: వరదలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ సహాయ చర్యల్లో మునిగిన చంద్రబాబు మూడో రోజు కూడా స్వయంగా రంగంలోకి దిగారు.
Amavasya September 2024 Telugu
భారీ వర్షాలతో నిండా మునిగిన విజయవాడ నగరాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నిమిషం పాటుపడుతున్నారు. నిరంతరం పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఉద్యోగులను పరుగులు పెట్టిస్తూనే ఆయన స్వయంగా సహాయ చర్యల్లో మునిగారు. వరుసగా మూడో రోజు కూడా ఆయన సహాయ చర్యలు చేపట్టారు. స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి మాట్లాడి భరోసా ఇచ్చారు. వారికి ఆహారం, నిత్యావసర వస్తువులు ఇచ్చారు.
'అధికారులందరూ సమన్వయంతో మీకు కేటాయించిన ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలబడి మానవతా దృక్పథంతో సహాయ సహకారాలు అందించాలి. సహాయ చర్యలకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నాం. ఆహార పదార్థాలు ఎక్కడా వృథా కాకుండా ఎక్కడపడితే అక్కడ కాకుండా ఆయా సచివాలయాల పరిధిలో సరైన విధంగా బాధితులకు అందించేందుకు చర్యలు తీసుకున్నాం. వరద ప్రభావంతో ప్రజలు పడే బాధ వర్ణనాతీతం. పాములు, తేళ్లు కూడా ఇళ్లలోకి వస్తున్నాయి.
'పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం. ప్రజలు కూడా సంయమనం పాటించి సహకరించాలి' అని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులు, విజ్ఞప్తుల కోసం మూడో నెంబర్‌ను కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. జక్కంపూడిలో విధులు సక్రమంగా నిర్వహించని ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఎవరైనా తమ విధులు సక్రమంగా నిర్వహించకపోతే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజీకి వచ్చిన బోట్లపై విచారణ చేయిస్తామని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Gudlavalleru engineering college
Vijayawada Floods NTR District Vijayawada Rescue Operations Heavy Rains Monsoon Ap Weather Krishna River Flood Prakasam Barrage
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వరద గండం..Chandrababu Naidu: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఏపీలో అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటికి వరదలు ముంచెత్తున్నాయి.
Read more »
Chandrababu: ప్రజల కోసం చంద్రబాబు బావమరిది ప్రోగ్రామ్ రద్దు.. బస్సులోనే నిద్రChandrababu Naidu Cancelled Balakrishna Event: ఆంధ్రప్రదేశ్‌లో వరదల పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకుని కలెక్టరేట్‌లోని బస్సులో నిద్రించనున్నారు.
Read more »
Chandrababu: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం.. మీ వలన పరువు పోతుంది!Chandrababu Strong Warns To TDP MLAs: కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు.
Read more »
Chandrababu: నిద్రపోని చంద్రుడు.. అర్ధరాత్రి సహాయ చర్యల్లో సీఎం చంద్రబాబుChandrababu Flood Rescue Operations: విజయవాడ జలదిగ్బంధం కావడంతో ప్రజలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. రోజంతా సమీక్షలు జరిపిన సీఎం బాధితుల కోసం అర్ధరాత్రి సహాయ కార్యక్రమాల్లో మునిగారు. బాధితులకు ఆహారం, నీళ్లు అందించి ధైర్యం చెప్పారు.
Read more »
Chandrababu Review: ఆదివారం సెలవు రద్దు.. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించిన సీఎం చంద్రబాబుChandrababu Naidu Cancelled Sunday Holiday: వర్షాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. ప్రజలను ఆదుకోవడానికి అందరినీ రంగంలోకి దింపారు.
Read more »
Helicopter Crash: ఆ హెలీకాప్టర్ చంద్రబాబు కోసమా, కుప్పకూలడంతో ప్రమాదం తప్పిందాMumbai to Hyderabad Helicopter Crashed is stand by for andhra pradesh cm chandrababu Helicopter Crash: ముంబై నుంచి హైదరాబాద్ వచ్చే క్రమంలో కుప్పకూలిన హెలీకాప్టర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం తీసుకొచ్చిందని తేలడంతో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి
Read more »