Chandrababu Naidu Cancelled Sunday Holiday: వర్షాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. ప్రజలను ఆదుకోవడానికి అందరినీ రంగంలోకి దింపారు.
Best Pension Scheme: NPS, UPS ఏ స్కీమ్ ఎంచుకోవాలని ఆలోచిస్తున్నారా..? ఏది బెస్ట్ అంటే.. పూర్తి వివరాలు ఇలా..!Gas Petrol Prices: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్, రేపు సెప్టెంబర్ 1 నుంచి భారీగా తగ్గనున్న గ్యాస్, పెట్రోల్ , డీజిల్ ధరలు
గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు, వరదలు తలెత్తడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఆదివారం అధికారుల సెలవులు రద్దు చేసి సహాయ చర్యల్లో ఉపక్రమింపచేశారు. ఫలితంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా వరద నియంత్రణ చర్యల్లో మునిగారు.
వరద ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షించి దానికి అనుగుణంగా సహాయ చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. వర్షాలు, వరదల కారణంగా ఆహారం, నీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వ్యాధులు ప్రభలకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వరద, నూజువీడులో రికార్డు స్థాయి వర్షంపై ఆయా మంత్రులు వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల వారికి బియ్యం, నిత్యావసరాలు సరఫరా చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
'వరద తగ్గిన తరువాత ఆస్తి, పంటనష్టం వివరాలు సేకరించాలి. రైతులు, కుటుంబాలకు వెంటనే సాయం అందించాలి' అని అధికారులకు సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి కూడా నష్టం అంచనా వేసి పంపాలని సూచించారు. బాధ్యతలు అప్పగించిన అధికారులు విధులు సరిగా నిర్వర్తించకుండా తప్పించుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రులు కూడా క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేలతో పర్యటించి ప్రజలకు భరోసా కల్పించాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Hidden camera in washroom: బాత్రూమ్ లో కెమెరా ఘటనలో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన విస్తుపోయే విషయాలు.. వీడియో ఇదే..
Heavy Rains Sunday Holiday Cancel Govt Officers Amaravati Flood Effected Areas Vijayawada Prakasam Barrage
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Chandrababu: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం.. మీ వలన పరువు పోతుంది!Chandrababu Strong Warns To TDP MLAs: కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు.
Read more »
Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వరద గండం..Chandrababu Naidu: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఏపీలో అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటికి వరదలు ముంచెత్తున్నాయి.
Read more »
Helicopter Crash: ఆ హెలీకాప్టర్ చంద్రబాబు కోసమా, కుప్పకూలడంతో ప్రమాదం తప్పిందాMumbai to Hyderabad Helicopter Crashed is stand by for andhra pradesh cm chandrababu Helicopter Crash: ముంబై నుంచి హైదరాబాద్ వచ్చే క్రమంలో కుప్పకూలిన హెలీకాప్టర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం తీసుకొచ్చిందని తేలడంతో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి
Read more »
Chandrababu Shock: చంద్రబాబు పర్యటనలో కలకలం.. అడ్డగించిన మాల సంఘాలుMala Community Leaders Protest In Chandrababu Tour: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలింది. ఆయన పర్యటనను కొందరు అడ్డగించడంతో కలకలం రేపింది.
Read more »
Chandrababu: సీఎం చంద్రబాబు బిజీబిజీ.. భారీ వర్షాలతో రాత్రి నిద్రపోకుండా సమీక్షChandrababu Naidu Busy Busy With Review On Heavy Rains: భారీ వర్షాలతో సీఎం చంద్రబాబు నాయుడు రోజంతా బిజీబిజీ గడిపారు. అతి భారీ వర్షాల ముప్పు పొంచి ఉండడంతో రాత్రి కూడా సమీక్ష చేశారు.
Read more »
Chandrababu Sarees: భార్యకు ప్రేమతో.. స్వయంగా చీరలు కొన్న సీఎం చంద్రబాబుChandrababu Sarees Bought To His Wife Nara Bhuvaneshwari: ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తన సతీమణికి ప్రేమగా చీరలు కొన్నారు. స్వయంగా చీరలు సెలక్షన్ చేసి తన భార్య భువనేశ్వరికి చీరలు తీసుకున్నారు.
Read more »