Allu Arjun: ట్విట్టర్ లో నాగబాబు అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు ఈ మధ్య పెట్టిన ఒక పోస్ట్ పోన్ ఆగ్రహానికి గురిచేసింది
మెగా ఫ్యామిలీలో.. చిన్న విషయానికి కూడా ఎక్కువ రియాక్ట్ అయ్యే నటుడు..ఎవరూ అంటే ముందుగా నాగబాబు పేరే వినిపిస్తుంది. మెగా హీరోలలో ఎవరిని ఏమన్నా కానీ.. నాగబాబు ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా మెగా ఫ్యామిలీని.. ఎవరైనా.. ఏమైనా అంటే వాళ్ళ పైన తెగ పోస్టులు పెడుతూ ఉంటారు. ఈ క్రమంలో నాగబాబు ఈమధ్య అల్లు అర్జున్ పైన పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయి.. అల్లు అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది.
గత కొద్దిరోజులుగా మెగా ఫ్యామిలీకి.. అల్లు ఫ్యామిలీకి మధ్య ఏదో చిన్న రచ్చ జరుగుతోందన్న రూమర్ వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఈ మధ్య అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి పోటీగా ఉన్న వైసీపీ పార్టీ ప్రచారంలో పాల్గొనడంతో.. నాగబాబు ఇన్-డైరెక్ట్ గా ఒక ట్వీట్ వేశారు. అయితే అల్లు అర్జున్ తన ఫ్రెండ్ కోసం ఎమ్మెల్యే సీటుకి పోటీ చేస్తుండగా.. నంద్యాలకి వెళ్లి ప్రచారం చేశారు. ప్రచారం చేసినప్పుడు కూడా అల్లు అర్జున్ పార్టీ తరపున కాకుండా తన ఫ్రెండ్ కోసమే ప్రచారం చేసినట్టు క్లారిటీ ఇచ్చాడు.
నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్ తీసేయడానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ అభిమానులే అని తెలుస్తోంది. ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడు అయినా పరాయి వాడే, మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే అంటూ’ నాగబాబు చేసిన ట్వీట్ అసలు ఎవరిని ఉద్దేశించి ట్విట్ చేశాడు అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ అది చదివితే మాత్రం 100కి 100% అల్లు అర్జున్ గురించే అని అర్థమవుతుందని..ఎవరికి తగినట్లుగా వారు దానిమీద స్పందిస్తూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ కి దారి తీశారు.
ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుని టార్గెట్ చేస్తూ వందలకు వందలు ట్వీట్లు పెట్టారు. ఇక ఈ వివాదం ముదరడంతో నాగబాబు తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేశారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో మరింత చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పిఠాపురం నుంచి పోటీ చేయడంతో ఆయన కోసం మెగా హీరోలు చాలామంది వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. అయితే అల్లు హీరో అల్లు అర్జున్ మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ కోసం సోషల్ మీడియా పోస్ట్ కి మాత్రమే పరిమితమయ్యారు. మరోపక్క తన స్నేహితుడిగా చెప్పుకుంటున్న నంద్యాల వైసిపి అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం మాత్రం స్వయంగా వెళ్లి తన స్నేహితుడికి ఓటు వేయాల్సిందిగా కోరారు.
Allu Arjun Nagababu Controversy
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Allu Arjun: మావాడైనా పరాయివాడే..అల్లు అర్జున్ పై నాగబాబు ఇన్ డైరెక్ట్ సెటైర్Nagababu Indirect Satire to Allu Arjun: నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్లో వేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టుతో అల్లు అర్జున్ కి ఇండైరెక్ట్ పంచ్ ఇచ్చారు నాగబాబు. అసలు విషయానికి వెళితే..
Read more »
Movie Stars Vote: మహేశ్ బాబు, చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్, విజయ్ ఎక్కడ ఓటు వేసేది ఇక్కడే..You Know Mahesh Babu Jr NTR Chiranjeevi Allu Arjun Ram Charan Polling Center: ఈసారి హైదరాబాద్ ప్రజలు ఓటింగ్‌కు కదులుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు ఎక్కడ ఓటు వేస్తారో.. అసలు వారైనా ఓటు వేయడానికి వస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.
Read more »
Pushpa 2 The Rule : కళ్లు చెదిరే అల్లు అర్జున్ భారీ రేటుకు పుష్ప 2 కర్ణాటక రైట్స్..Pushpa 2 The Rule - Karnataka Rights: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ పుష్ప మూవీ. ఈ సినిమాతో బన్ని ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటాడు. ఇప్పటికే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Read more »
Case Registered on Allu Arjun: అల్లు అర్జున్ పై ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు.. ఎందుకంటేAllu Arjun: ఈరోజు నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం అల్లు అర్జున్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ పై ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.. వివరాల్లోకి వెళితే..
Read more »
Allu Arjun: పవన్ కళ్యాణ్ కి మద్దతు.. వైసిపి పార్టీకి సపోర్ట్.. అల్లు అర్జున్ వింత తీరుAllu Arjun Supports YSRCP MLA: అల్లు అర్జున్ నంద్యాలలోని వైసిపి ఎమ్మెల్యేకి మద్దతుగా నిలవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాకుండా ఏకంగా నంద్యాలకి వెళ్లి అల్లు అర్జున్ వైసిపి ఎమ్మెల్యే తరుపున ప్రచారం కూడా చేశారు.
Read more »
Allu Arjun: స్టైలిష్ స్టార్ తదిపరి సినిమా స్క్రిప్ట్ అదే.. చిరంజీవిని ఫాలో అవ్వనున్న హీరోAllu Arjun-Trivikram: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప2 సినిమా కోసం.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ మొదటిసారిగా ఈ సినిమా కోసం..
Read more »