Andhra pradesh Election 2024 voting live updates election commission ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఇక అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది.
AP Assembly Election 2024 Polling live Updates: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈసారి పోలింగ్ శాతం మరింతగా పెంచేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ సారించింది. పూర్తి వివరాలుఇలా ఉన్నాయి.Patangi Toll plaza: సంక్రాంతిని గుర్తుకు తెచ్చిన ఓట్ల పండగ.. పతంగీ టోల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్..
AP Assembly Election 2024 Polling live Updates: ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మాక్ పోలింగ్ అనంతరం పోలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4, 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఇక అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. పాలకొండ, సాలూరు, కురుపాం నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్ల 14 లక్షలు కాగా అందులో పురుషులు 2.3 కోట్లు, మహిళలు 2.10 కోట్లున్నారు. ఇక ధర్డ్‌జెండర్ ఓట్లు 3,421 ఉన్నాయి.
ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ నిర్వహించడం ద్వారా ఓటింగ్ పై వేసవి ప్రభావం లేకుండా చూసేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, ఎండల్ని దృష్టిలో ఉంచుకుని నీడ కల్పించేలా టెంట్లు వేయడం వంటివి చేస్తున్నారు. వడదెబ్బ తగిలితే తక్షణం వైద్య సదుపాయం అందించేలా మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచుతున్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో 79.77 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి మరింత ఎక్కువగా పోలింగ్ నమోదయ్యేలా ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాల్లో సెక్షన్ 144 అమల్లో ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 3.30 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. 1.14 లక్షల మంది పోలీసులను భద్రత కోసం ఉపయోగిస్తున్నారు. అదనంగా 10 వేల మంది సెక్టార్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బీఎల్ఓలు విధుల్లో ఉంటారు. మొత్తం 5.26 లక్షలమంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు.ఈసారి 30,111 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఉంటుంది. 12,459 కేంద్రాల్ని సున్నితంగా గుర్తించారు. పోలింగ్ కేంద్రాల్లో ఫోన్లకు అనుమతి లేదు.
Andhra Pradesh Elections 2024 Ap Assembly Election 2024 Voting Live Updates Andhra Pradesh Election 2024 Polling Live Andhra Pradesh Assembly Election 2024 Polling New
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Loksabha Elections 2024: నాలుగోదశలో 96 స్థానాలకు ఎన్నికలు, బరిలో ప్రముఖులు వీరేLoksabha Elections 2024 fourth phase for 96 parliament constituencies ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఎన్నికల నిబంధనల్ని ఖాతరు చేయకుండా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన వ్యాఖ్యలతో కొనసాగుతున్నాయి
Read more »
Nominations End: ముగిసిన నామినేషన్ల పర్వం.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో దరఖాస్తులుNomination Process Finished For Telangana And AP Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు పూర్తవడంతో అభ్యర్థులు ప్రచారం స్పీడ్ పెంచనున్నారు.
Read more »
TS Loksabha Elections 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు అంతా సిద్ధం, ఓటర్లు ఎంతమంది, ఎన్ని పోలింగ్ కేంద్రాలుTelangana loksabha Election arrangements 2024 set all arrangements తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలో సెక్షన్ 144 విధించారు. పోలింగ్ సందర్భంగా విధి విధానాలు అటు మీడియాకు, ఇటు రాజకీయ పార్టీలకు జారీ అయ్యాయి.
Read more »
YCP Election Manifesto: ఎన్నికల మేనిఫెస్టో వైసీపీకు గేమ్ ఛేంజర్ అవుతుందాAndhra pradesh SSC Results 2024 declared check your 10th class results ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2300 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత కన్పించింది.
Read more »
AP Election Arrangements: ఏపీ ఎన్నికలకు అంతా సిద్ధం, ఓటర్లు ఎంతమంది, ఎన్ని పోలింగ్ కేంద్రాలుAndhra pradesh Elections 2024 arrangements total voters ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మే 13 వ తేదీన జరగనున్న పోలింగ్‌కు అటు రాజకీయ పార్టీలు ఇటు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈవీఎంలలో తీర్పు నమోదు చేసేందుకు ఓటర్లు సిద్ధమౌతున్నారు.
Read more »
AP TS Rain Alert: ఏపీ, తెలంగాణలో భారీ వర్షసూచన, పోలింగ్ రోజు ఎలా ఉంటుందిAndhra pradesh and Telangana will have moderate to heavy rains for coming 3 days ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షసూచన జారీ అయింది. ఫలితంగా ఏపీ, తెలంగాణల్లో రేపు జరగనున్న పోలింగ్‌పై ప్రభావం పడనుంది. రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.
Read more »