YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నా అనేక ఊహాగానాలకు తెరలేపింది. జగన్ ఇండి కూటమిలో చేరడానికి సిద్దపడుతున్నారనే చర్చ జోరందుకుంది. కానీ జగన్ ఇండియా కూటమిలో చేరడానికి ఆ ఇద్దరు నేతలే అడ్డంకిగా మారారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు..
: ఏపీ మాజీ ముఖ్యమంత్రి..వైయస్ఆర్సీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమిలో చేరడం ఆ ఇద్దరు నేతలకు మాత్రం పెద్దగా ఇష్టం లేదట. జగన్ కూటమిలో చేరడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. ఇంతకీ జగన్ ను అంతలా వ్యతిరేకిస్తున్న ఆ ఇద్దరు ఎవరు..? అసలు వారికి జగన్ కు ఎందుకు చెడిందనే విషయం ఇపుడు ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల తర్వాత వైఎస్సార్పీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆలోచన మారినట్లు కనిపిస్తుంది.
బీజేపీ ధోరణితో భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ వ్యూహాలు అమలు చేయాలి అన్న కోణంలో సన్నిహిత వర్గాలతో సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. ఒక వైపు ఏపీలో రోజు రోజుకు పార్టీ పరిస్థితి ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళుతుంది. ఇలాంటి తరుణంలో ఇతర పార్టీల మద్దతు తప్పనిసరి అయ్యింది. దీంతో భవిష్యత్తు అడుగులు ఎటు వేయాలా అన్న సందిగ్ధంలో జగన్ ఉన్నారు. బీజేపీకీ ఆల్టర్ నేట్ గా కాంగ్రెస్ ఒక్కటే కనిపిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బీజేపీతో సమానంగా ఎన్నికల్లో రాణించింది.
ఇండియా కూటమిలో ఉన్న ప్రధాన పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ కు జగన్ కు మధ్య తీవ్ర అగాథం ఉంది. రాజకీయంగా రెండు పార్టీల మధ్య వైరం. రెండు పార్టీల మధ్య భావ సారూప్యత ఉన్నా గతంలో జరిగిన రాజకీయ పరిణామాలు ఇద్దరి మధ్య పూడ్చలేని అగాధాన్ని సృష్టించాయి. అలాంటి వాటిని సైతం జగన్ పక్కన పెట్టేందుకు సిద్దపడుతున్నట్లు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది నానుడి. అది జగన్ విషయంలో కూడా నిజం కాబోతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది.
ఇంత వరకు బాగానే ఉన్నా...ఇద్దరు మాత్రం జగన్ ఇండియా కూటమిలో చేరడానికి అడ్డుపడేలా కనిపిస్తున్నారు. జగన్ ఇండియా కూటమిలో చేరడానికి ఒక వైపు ప్రయత్నాలు కొనసాగిస్తుంటే ఆ ఇద్దరికి పెద్దగా ఇష్టం లేనట్టుగా కనిపిస్తుంది. అందులో ఒకరు స్వయాన జగన్ మోహన్ రెడ్డి సోదరి , ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాగా మరొకరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరికి జగన్ ఇండియా కూటమిలో చేరడం పెద్దగా ఇష్టపడడం లేదని తెలుస్తుంది.
YS Sharmila Ysrcp Telangana Revanth Reddy India Alliance Congress AP Congress Parliament Session
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్..Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై తెరకెక్కించే సినిమాల్లో కంపల్సరీ ఆ విషయాలు ఉండేలా చూసుకోవాలని కండిషన్ పెట్టారు.
Read more »
Kalki 2898 AD: ఆ రెండు ఏరియాలో బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో ప్రభాస్ ‘కల్కి’..Kalki 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో లాభాల్లోకి వచ్చిన ఈ సినిమా ఆ రెండు ఏరియాల్లో మాత్రం ఇంకా బ్రేక్ కు చాలా దూరంలో ఆగిపోయింది.
Read more »
Prabhas: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..Prabhas: ఆ తరంలో ఎన్టీఆర్, కృష్ణంరాజు.. ఈ జెనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ ఆ క్రెడిట్ దక్కింది. అవును ఆ జనరేషన్ లో మహా నటుడు ఎన్టీఆర్, కృష్ణంరాజు ఆ తరహా పాత్రల్లో మెప్పించారు. ఈ తరంలో రాజశేఖర్, ప్రభాస్ లు ఆ క్యారెక్టర్ లో నటించారు. వివరాల్లోకి వెళితే..
Read more »
YS Jagan Dharna: మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలనం.. ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్YS Jagan Dharna At Delhi For President Rule In AP: టీడీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న దాడులపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Read more »
YS Jagan Mohan Reddy: ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి.. తక్షణమే జోక్యం చేసుకోండి.. ప్రధానికి జగన్ లేఖ..YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని..తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సుధీర్ఘ లేఖ రాసారు.
Read more »
YS Jagan Mohan Reddy: రాష్ట్ర అప్పుల చిట్టా బయటపెట్టేసిన మాజీ సీఎం జగన్.. ఏపీ అప్పులు ఎంతంటే..?YS Jagan Fires on Chandrabau Naidu: ఏపీ అప్పుల చిట్టాను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బయటపెట్టారు. ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వ అప్పు రూ.5,18,708 కోట్లు అని.. కానీ రూ.14 లక్షల కోట్లు అప్పు చూపాలని చంద్రబాబు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more »